'రైతే రాజు' అని నినదించిన ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్

updated: March 9, 2018 12:28 IST
'రైతే రాజు' అని నినదించిన ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎన్నికల ముందు చివరి బడ్జెట్ ను అసెంబ్లీకి సమర్పించింది. మొత్తం రూ.1,91,063.61 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టింది.  అందులో భాగంగా  రూ.రూ.12,355 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. మంత్రి సోమిరెడ్డి శాసనసభలో వ్యవసాయ బడ్జెట్‌ను పెట్టారు. 2022 నాటికి ఆదాయం రెట్టింపు చేయడం లక్ష్యమని మంత్రి స్పష్టం చేసారు. ఈ విషయమై   తన ప్రసంగంలో భాగంగా మాట్లాడుతూ... వ్యవసాయ రంగంలో ముఖ్య సమస్యలని పరిశీలించి వాటిని అధిగమించటానికి తగు సూచనలు చేస్తూ వ్యవసాయాన్ని లాభసాటి వ్యాపకంగా మార్చటానికి ప్రైమరీ సెక్టార్ మిషన్ ను ఏర్పరచడమైనది. ఉత్పాదకతను పెంచటానికి ప్రాధమికంగా దృష్టి సారిస్తూ చేపట్టిన ప్రాధమిక కార్యక్రమాలు మంచి ఫలితాలను చూపుతూ పూర్తి స్దాయికి చేరుకోనున్నాయి అన్నారు. 

వ్యవసాయ బడ్జెట్‌లోని ముఖ్యాంశాలు..

రెవెన్యూ లోటు రూ. రూ.12,352 కోట్లు

జాతీయ స్థాయి వృద్ధి రేటుతో పోల్చితే 14 శాతం అదనంగా నమోదు

రబీలో 42 శాతం వర్షపాతం తక్కువగా నమోదు

మొక్కజొన్న ఉత్పత్తిలో దేశంలో రెండోస్థానం

పెట్టుబడి వ్యవయం 467 కోట్లు

వరి దిగుబడి హెక్టార్‌కు 5176 కిలోల నమోదు

వరి ఉత్పత్తిలో దేశంలో ఏపీ మూడో స్థానం

2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం

90శాతం రాయితీలో వేరుశెనగ విత్తనాలు పంపిణీ

ఉత్తరాంధ్రలో దిగుబడి పెంపునకు 50శాతం రాయితీతో విత్తనాలు

తుంగడెంచలో మెగా సీడ్ పార్క్ ఏర్పాటు

వరి నేరుగా విత్తుకునే విధానంతో అధిక దిగుబడులు

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం

అన్ని జిల్లాలకు వ్యవసాయ యాంత్రీకరణ పథకం విస్తరణ

ఊబర్ ద్వారా యంత్రపరికాలను అందుబాటులో ఉంచుతున్నాం

దేశంలో తొలిసారిగా 7లక్షలమంది కౌలు రైతులకు రుణాలు

జైకా ప్రాజెక్టు కింద వ్యవసాయ యంత్రాల శిక్షణా కేంద్రాలు

అనంతపురంలో బిందు, తుంపర పరికరాల కేంద్రాలు ఏర్పాటు

వ్యవసాయ రంగంలో 25శాతం వృద్ధి రేటు

వరి, మొక్కజొన్న, పప్పుధాన్యాల ఉత్పత్తి పెరిగింది.

వందశాతం రాయితీతో సూక్ష్మ పోషకాలు

విత్తన పంపిణీలో జాతీయ స్థాయి అవార్డు సాధించాం.

వ్యవసాయ యాంత్రీకరణకు రూ.250 కోట్లు

పొలం పిలుస్తోంది, చంద్రన్న క్షేత్రాలకు రూ. 12.5 కోట్లు

వడ్డీ రాయితీకి రూ. 170 కోట్లు, పావలా వడ్డీకి రూ. 5.44 కోట్లు

గన్నవరంలో ప్లాంటేషన్ మేనేజ్‌మెంట్ సెంటర్‌‌కు రూ. 23 కోట్లు

శీతల గిడ్డంగులు, ప్యాకింగ్ యూనిట్లు ఏర్పాటు

వరి, వేరుశెనగ, రాగిలో 17 వంగడాలు విడుదల

నూతన పద్ధతులతో 30 శాతం ఉత్పత్తి పెరిగింది.

పది లక్షల మంది రైతులతో రైతు ఉత్పత్తి దారుల సంఘాలు ఏర్పాటు

ప్రత్యేక మార్కెట్ సౌకర్యాల కల్పనుకు కృషి

కూరగాయల ఉత్పత్తి, నాణ్యత పెంపునకు రాయితీలు

సెరికల్చర్ రైతులకు 48 కోట్లతో రాయితీలు

Disclaimer: The following shared video may not be part of Telugu100.com network. Sometimes we may give external links to strengthen the quality of the posts. In this case, Telugu100.com is not responsible for the content of the videos and the original owner would be responsible for the same.

comments